- వైద్య సలహాలు ఇవ్వొద్దని,
- అల్లోపతిపై విమర్శల వీడియోలు తొలగించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఎలాంటి అనధికారిక వైద్య సలహాలు ఇవ్వొద్దని, చికిత్సా పద్ధతులు సూచించవద్దని, అలాగే అల్లోపతి, డాక్టర్లపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దంటూ వీరమాచినేని రామకృష్ణ (వీఆర్‌కే)పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు (గ్యాగ్ ఆర్డర్) జారీ చేసింది.
హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్‌డీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన 26వ అడిషనల్ చీఫ్ జడ్జి వెంపాటి అపర్ణ.. సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ చానళ్లలో వీఆర్‌కేకు సంబంధించి అభ్యంతరకరంగా ఉన్న వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని వీఆర్‌కేతో పాటు యూట్యూబ్, మెటా సంబంధిత మీడియా సంస్థలను ఆదేశించారు. అక్టోబర్ 7 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
